సిఎం పాలనను చూసి ఓర్వలేకనే బాబు కుట్రలు

Kurasala Kannababu
Kurasala Kannababu

అమరావతి: ఏపి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. హిందూ విగ్రహాల కూల్చివేత ఘటనల వెనుక ఉంది టిడిపి కార్యకర్తలేనని కన్నబాబు విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన బృందం అబద్ధాల ఫ్యాక్టరీ పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న సిఎం జగన్‌ పాలనను చూసి ఓర్వలేక బాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు కులాన్నీ, అమరావతిని ఎంచుకుని అసత్యాలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మతాన్ని భుజానికెత్తుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/