ఏసిబి వలలో జూబ్లీహిల్స్‌ అడ్మిన్‌ ఎస్‌ఐ

రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

ACB Trapped SI
ACB Trapped SI

హైదరాబాద్‌: నగరంలో తాజాగా మరో అవినీతి అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో అడ్మిన్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సుధీర్‌ రెడ్డిని అధికారులు లంచం తీసుకుటుండగా పట్టుకున్నారు. ఓ సివిల్‌ కేసును పరిష్కరించేదుకుగాను రూ. 50 వేలు లంచం డిమాండ్‌ చేయగా సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు. అయితే అంతకు ముందే ఏసిబి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వలపన్నిన అధికారులు సుధీర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లోనే ఆయన్ను ఏసిబి అధికారులు విచారిస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు సుధీర్‌ రెడ్డిపై గతంలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది జూబ్లీహిల్స్‌లో అడ్మిన్‌ ఎస్‌ఐగా సుధీర్‌రెడ్డి విధుల్లో చేరారు. సుధీర్‌ రెడ్డి 2014 బ్యాచ్‌కు చెందినట్లుగా తెలుస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/