ఎమ్మెల్సీ క‌రీమున్నీసా హఠాన్మరణం

ముఖ్యమంత్రి జగన్ సంతాపం

ap mlc Karimunnisa-File
ap mlc Karimunnisa-File

Amaravati: కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ క‌రీమున్నీసా (56) శుక్రవారం రాత్రి హఠాన్మరణం చెందారు గుండెపోటు తో ఆమె మృతి చెందినట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. శుక్రవారం శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం దక్కలేదు. వైఎస్సార్ కాంగ్రెస్​ పార్టీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీలో చురుగ్గా పనిచేశారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్‌ అవకాశం కల్పించారు. ​ ఆమె మృతికి ముఖ్యమంత్రి జగన్ సంతాపం ప్రకటించారు.

తెలంగాణ వార్తల కోసంతెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/