సుజనా చౌదరిపై మంత్రి కన్నబాబు మండిపాటు

రాజధాని పేరుతో ఎన్ని వెల కోట్లు కుంభకోణం చేశారో సుజనా మాటలను చుస్తే అర్థమవుతుంది

Kurasala Kannababu
Kurasala Kannababu

విజయవాడ: రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరిపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఒక ఎంపీగా ఉంటూ దేశం వదిలి వెళ్లిపోతానని అనడం సిగ్గుచేటని అన్నారు. రాజధాని పేరుతో ఎన్ని వేల కోట్లు కుంభకోణం చేశారో సుజనా మాటలను చూస్తే అర్థమవుతుందన్నారు. అందుకే ఇప్పుడు సుజనా చౌదరి మరో దేశానికి కాందిశీకుడిగా పోతానంటూ దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని కన్నబాబు దుయ్యబట్టారు. దోపిడి చేసిన వాళ్లు చాలా మంది దేశం వదిలి వెళ్లారని..ఇప్పుడు సుజనా చౌదరి అలాగే పారిపోదామనుకుంటున్నారని విమర్శించారు. సుజనా చౌదరి తొందరపడవద్దని త్వరలోనే ఆయన చేసిన అవినీతిని బయటపెడతామని మంత్రి స్పష్టం చేశారు. కేసులకు బయపడే సుజనా చౌదరి టిడిపి నుండి బిజెపిలోకి వెళ్లారని ఎద్దేవా చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/