ఏపీలో ఏప్రిల్ రెండో వారం నుంచి ఇంటర్ పరీక్షలు

ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం

అమరావతి: ఏపీ లో ఇంటర్ పరీక్షలకు నిర్వహణకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. ఏప్రిల్ రెండో వారం నుంచి పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహకాలు చేస్తోంది. రేపు లేదా ఎల్లుండి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మార్చిలోగా ప్రాక్టికల్స్ ను నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది పరీక్షలను నిర్వహించకుండానే విద్యార్థులందరినీ ఏపీ ప్రభుత్వం పాస్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా, తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/