సంక్రాంతి బరిలో బంగార్రాజు

సంక్రాంతి బరిలో బంగార్రాజు

సంక్రాంతి బరిలో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ , సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ లతో పాటు రాధే శ్యామ్ మూవీస్ బరిలో ఉండగా..ఇప్పుడు కింగ్ నాగార్జున కూడా బంగార్రాజు తో సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నారు. గతంలో వ‌చ్చిన‌ “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఇది సిక్వెల్ గా తెర‌కెక్క‌తుంది. ఈ చిత్రంలో నాగ్ “బంగార్రాజు” పాత్రల్లో కనిపించ‌బోతున్నారు. మనసును దోచేందుకు డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ టాగ్ జోడించారు. అలాగే.. ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన్ గా వ‌స్తున్న ఈ చిత్రంలో నాగ్ తో నాగ చైతన్య మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

ఈ చిత్రం ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సిండే.. కానీ, కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడి .. విడుద‌ల లేట్ అయ్యింది. అయితే ఎట్టకేలకు చిత్ర యూనిట్ సినిమాను పూర్తి చేసే పనిలో పడింది. ఈ సినిమాలో చైతూకు జంట‌గా కృతి శెట్టి నటిస్తుండగా, నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జనవర్‌ 15న విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం 2016లో సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైంది. ఇప్పుడు సరిగ్గా ఐదేళ్ల తర్వాత సీక్వెల్‌ను అదే రోజు విడుదల చేయనున్నారన్నమాట. మరి సంక్రాంతి బరిలో అగ్ర హీరోల సినిమాలను బంగార్రాజు తట్టుకోగలడో లేదో చూడాలి.