ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే

ap high court
ap high court

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించింది. దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ప్రకాశం జిల్లాకు చెందిన సురేశ్ తో పాటు మరికొందరు పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు… ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్ పై స్టే విధించింది. ఈ సందర్భంగా… ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. దీనిపై స్టే విధిస్తామని నిన్ననే హైకోర్టు తెలిపింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకుని రేపు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని… తీర్పును ఒకరోజు (ఈరోజుకు) వాయిదా వేయాలని కోర్టును అడ్వొకేట్ జనరల్ కోరారు. దీంతో విచారణను ఈరోజుకు హైకోర్టు వాయిదా వేసింది. ఈ రోజు విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలిపారు. దీంతో, ఎస్టీజీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమంతించే ఆ ఒక్క రూల్ పై హైకోర్టు స్టే విధించింది.