కోర్టు ధిక్కరణ కేసు.. ప్రశాంత్‌ భూషణ్‌ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు

శిక్ష విధింపుపై ఈ నెల 20న వాదనలు విననున్న కోర్టు

Supreme Court holds Prashant Bhushan guilty of contempt for tweets

న్యూఢిల్లీ: కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో లాయ‌ర్ ప్ర‌శాంత్ భూష‌న్ దోషిగా తేలారు. చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోన్డేతో పాటు సుప్రీంకోర్టుపై ఇటీవ‌ల అనుచిత ట్వీట్లు చేసిన కేసులో ఆయ‌న్ను అత్యున్న‌త నాయ‌స్థానం త‌ప్పుప‌ట్టింది. అయితే ఈ కేసులో ఆగ‌స్టు 20వ తేదీన శిక్ష‌ను సుప్రీంకోర్టు ఖ‌రారు చేయ‌నున్న‌ది. అరుణ్ మిశ్రా, బీఆర్ గ‌వాయి, కృష్ణ‌మురారీల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మానం ఈ తీర్పును ఇచ్చింది. ఆగ‌స్టు 3వ తేదీన జారీ చేసిన అఫిడ‌విట్‌లో లాయ‌ర్ ప్ర‌శాంత్ భూష‌ణ్ త‌న వివాదాస్పద ట్వీట్ల ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఆ క్ష‌మాప‌ణ‌ల‌ను తిర‌స్క‌రించింది. సుప్రీం న్యాయ‌మూర్తుల‌ను విమ‌ర్శించినంత మాత్రాన .. యావ‌త్ కోర్టును త‌ప్పుప‌ట్టిన‌ట్లు కాద‌ని భూష‌ణ వాదించారు.

ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారీలతో కూడి త్రిసభ్య ధర్మాసనం కొన్ని రోజులుగా విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపిస్తూ… రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకుని తాను అభిప్రాయాలను వ్యక్తం చేశానని అన్నారు. తాను కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడలేదని చెప్పారు. తనపై ఈ కేసుకు కారణమైన ట్వీట్లు న్యాయస్థానం ప్రతిష్ఠకు భంగం కలిగించవని చెప్పారు. కోర్టు అధికారాన్ని తగ్గించవని తెలిపారు. అయితే, ఆయన దీనిపై ఆగస్టు 3న సమర్పించిన అఫిడవిట్‌పై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/