ఏడాదిగా నో శాలరీ …!

రిలయన్స్ సంస్థ తాజా వార్షిక నివేదిక వెల్లడి

Mukesh Ambani- No Salary
Mukesh Ambani

Mumbai: కరోనా వ్యాప్తి ప్రభావం వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది, దీంతో ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆయన తన పారితోషికాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఆయన ఎవరోకాదు,.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంబానీ కనీసం నయా పైసా జీతం తీసుకోలేదు.

రిలయన్స్ సంస్థ తాజా వార్షిక నివేదికలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంబానీ పారితోషికం జీరో అని వెల్లడించింది. .అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.15 కోట్లు జీతం పొందారు. పదకొండేళ్ళ నుంచి ఆయన ఇదే విధంగా జీతం తీసుకుంటున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయన తన జీతం, పరిలబ్ధులు, భత్యాలు, కమిషన్ కలిపి రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఏడాది జూన్‌లో విడుదల చేసిన ప్రకటనలో, దేశంలో కోవిడ్ ప్రభావం సమాజం, ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగాలపై తీవ్రంగా పడటంతో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ డి అంబానీ తన జీతాన్ని వదులుకోవాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా , రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పీఎంఎస్ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్ రెండేళ్ళలో తమ పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను పొందారు. ప్రసాద్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.11.99 కోట్లు (అంతకుముందు రూ.11.15 కోట్లు), కపిల్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4.24 కోట్లు పొందారు. (అంతకుముందు రూ.4.04 కోట్లు )

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/business/