స్కిల్ డెవలప్‌మెంట్ కేసు..లోకేష్‌కు భారీ ఊరట

ap-high-court-has-disposed-lokesh-petition-in-the-skill-development-case

అమరావతిః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇవాళ ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా మధ్యాహ్నానికి లోకేష్‌పై ఉన్న స్కిల్ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది. దీంతో లోకేష్‌కు బిగ్ రిలీఫ్ దక్కినట్టయ్యింది. లోకేష్‌ను స్కిల్ కేసులోనిందితుడిగా తాము చేర్చలేదని సీఐడీ చెప్పింది. ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఒకవేళ ఈ కేసులో నిందితుడిగా చేరిస్తే 41-ఏ కింద నోటీసులు ఇస్తామని న్యాయస్థానానికి సీఐడీ అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో లోకేష్‌‌ను ఈరోజు వరకూ లోకేష్‌ను మేము నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని హైకోర్టుకు సీఐడీ వివరించింది. హైకోర్టు తీర్పుతో టిడిపి శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ప్రభుత్వం కక్షపూరితంగా, అక్రమంగా కేసులు బనాయించవచ్చు కానీ.. న్యాయస్థానాల్లో న్యాయమే జరుగుతుందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇది సీఎం వైఎస్ జగన్‌కు దిమ్మతిరిగే షాకేనని టిడిపి శ్రేణులు చెప్పుకుంటున్నాయి. త్వరలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా శుభవార్త రావాలని.. టిడిపి కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఒక్క లోకేష్ విషయంలోనే కాదు.. టిడిపి అధినేత చంద్రబాబుకు కూడా త్వరలోనే బిగ్ రిలీఫ్ రావొచ్చని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.