ఏపిలో భారీగా డీఎస్పీ, ఐపీఎస్‌ల బదిలీలు

అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

ap-govt-transfer-ips-and-dsps

అమరావతిః ఐఏఎస్ అధికారులు, డీఎస్పీలను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గత అర్ధరాత్రి 12.48 గంటల సమయంలో ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన వారిలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు, 70 మంది డీఎస్పీలు ఉన్నారు. మొత్తం 55 పోలీసు సబ్‌డివిజన్‌లకు ప్రస్తుతం పనిచేస్తున్న వారిని బదిలీ చేసి ఆ స్థానాల్లో వేరే వారిని సబ్ డివిజినల్ పోలీసు అధికారులు (ఎస్‌డీపీవీ), ఏసీపీ, ఏస్పీలు(ఐపీఎస్)‌గా నియమించారు.