గవర్నర్‌ తో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల చర్చలు..సానుకూల స్పందన

rtc-workers-protest-demanding-approval-of-ltc-bill-by-governor

హైదరాబాద్‌ః గవర్నర్‌ తమిళి సై తో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలం అయ్యాయి. ఈరోజు గవర్నర్‌ తో ఆర్టీసీ కార్మికులు భేటీ అయ్యారు. అయితే.. ఈ సమావేశం అనంతరం.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సంఘ నేత థామస్ రెడ్డి మాట్లాడుతూ…గవర్నర్ తమిళ సై సానుకూలంగా స్పందించారన్నారు.

తమ సమస్యలపై గవర్నర్‌ తమిళి సై సుదీర్ఘంగా చర్చించారు..సమ్మె కాలంలో కూడా నేను మీకు సహకరించానని వివరించారు. కార్మికుల మేలు కోసమే ప్రశ్నలు రాశాను అని చెప్పారని వెల్లడించారు. ప్రభుత్వానికి కొన్ని డౌట్స్ ఉన్నాయని రాసి క్లారిఫికేషన్ కోసం అడిగాను…ప్రభుత్వ వివరణ తనకు ఇంకా అందలేదని.. వివరణ అందిన తర్వాత బిల్లు ఆమోదిస్తానని తెలిపారన్నారు. అసెంబ్లీ సెషన్ ముగిసే లోపు కచ్చితంగా ఆమోదించేoదుకు ప్రయత్నిస్తానని గవర్నర్‌ చెప్పినట్లు థామస్‌ రెడ్డి పేర్కొన్నారు. సత్వర పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తాను అని గవర్నర్ తెలిపారు..నేరుగా ఆమె ఏమైనా సవరణలు ఉంటే రాసి పంపడానికి సానుకూలంగా స్పందించారని తెలిపారన్నారు.