ఏపీలో అగ్రవర్ణ పేదల సంక్షేమ శాఖ ఏర్పాటుకు జీవో జారీ

అమరావతి: ఏపీలోని ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ఏపీ సర్కార్ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. అగ్రవర్ణ పేదల సంక్షేమంకోసం ప్రత్యేక శాఖతో పాటు జైన్‌లు, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం ఏకకాలంలో రెండు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో అగ్రవర్ణాల్లో పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుతం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణ వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ దక్కనుంది. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/