చంద్రబాబు లేఖలపై డీజీపీ సవాంగ్‌ కీలక వ్యాఖ్యలు

దేవాలయాలపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకున్నాం

gautam sawang
gautam sawang, ap DGP

అమరావతి: టిడిపి అధినేత చంద్రబు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనపై రాస్తున్న లేఖలపై ఏపి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అవాస్తవాలతో లేఖలు రాస్తున్నారని… విచారణ జరిపితే ఆరోపణలు అవాస్తవాలను తేలుతోందని చెప్పారు. రాజకీయ అజెండాతో లేఖలు రాస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసేలా చర్యలను చేపట్టామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించబోమని అన్నారు. హిందూ దేవాలయాలపై సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్లపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/