రూ.75 విలువ కలిగిన స్మారక నాణెం విడుదల చేయనున్న ప్రధాని

pm modi

న్యూఢిల్లీ: 16వ తేదీన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) 75 వ వార్షికోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి ఎఫ్‌ఏఓతో భారత్‌కు ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని గుర్తు చేస్తూ రూ.75 విలువ కలిగిన స్మారక నాణెం విడుదల చేయనున్నారు. ఇటీవల అభివృద్ధి చేసిన ఎనిమిది పంటల బయోఫోర్టిఫైడ్‌ రకాలను కూడా ప్రధాని జాతికి అంకితం చేస్తారని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ (డబ్ల్యూసీడీ) మంత్రి పాల్గొననున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/