తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పల్లెల పండుగ, రైతుల పండుగ, మన అక్కచెల్లెమ్మల పండుగ… మొత్తంగా మన సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెప్పే అచ్చ తెలుగు పండుగ అని అభివర్ణించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు జగన్ తెలిపారు. ఈ మకర సంక్రాంతి రాష్ట్ర ప్రజల జీవితాల్లో అభివృద్ధితో కూడిన మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ పండుగ తెచ్చే సంబరాలతో తెలుగు లోగిళ్లలో, ప్రతి ఇంటిలోనూ ఆనందాల సిరులు వెల్లివిరియాలని అభిలషిస్తున్నట్టు సీఎం జగన్ వివరించారు.

తెలుగు ప్రజలు జరుపుకునే పండగల్లో సంక్రాంతి పండగ చాల ప్రాముఖ్యమైంది. తెలంగాణ లో కంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. సినీ, రాజకీయ , సామాన్య ఇలా అంత కూడా తమ ఫ్యామిలీ సభ్యులతో ఘనంగా మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలను జరుపుకుంటారు.