చంద్రబాబు ఫై మరో కేసు నమోదు చేసిన CID

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు ఫై మరో కేసు నమోదు చేసింది CID . మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో పీటీ వారెంట్ ను దాఖలు చేసింది. చంద్రబాబును ఏ3గా చేర్చగా… సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టు అనుమతించింది. అవినీతి నిరోధక చట్టం కింద ( ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చంద్రబాబుపై ఈ కేసు నమోదైంది.ఈ కేసుకు 18/2023 FIR నంబర్ ను కేటాయించారు. ఇప్పటికే స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసు, అంగళ్ల కేసు , ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు చంద్రబాబు కు చుట్టుకోగా..ఇప్పుడు మరో కేసు ఆయనకు చుట్టుకుంది.

ఈ కేసు ఫై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కక్ష సాధింపునకు మరో రూపమే జగన్ అని మండిపడ్డారు. కక్ష సాధింపులో నువ్వు ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ బ్రదర్ అంటూ ఘాటుగా స్పందించారు. పిచ్చికి వాడుతున్నట్టే, కక్ష సాధింపు ధోరణికి కూడా మందులు వాడాలని అన్నారు.

రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది రోగాల బారినపడ్డారని, 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని లోకేశ్ వెల్లడించారు. ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతోందో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. మందుబాబుల తిట్లు వినే ధైర్యం జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు.