నేడు మంత్రులు, ఎమ్మెల్యేలతో సిఎం కెసిఆర్‌ భేటి

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్- రంగారెడ్డి- హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కుమార్తె వాణీదేవి పేరును ఖ‌రారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వాణీదేవి ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. వాణీదేవి నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు సిఎం కెసిఆర్‌ ఈ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేల‌తో భేటీ కానున్నారు. ఈ స‌మావేశానికి వాణీదేవి కూడా హాజ‌రు కానుంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై మంత్రులు, ఎమ్మెల్యేల‌కు ముఖ్య‌మంత్రి కెసిఆర్ దిశానిర్దేశం చేయ‌నున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/