బండి సంజయ్ అరెస్ట్ ను ఖండించిన ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ ని ఖండించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇది ఒక పిరికిపంద చర్యగా అభివర్ణించారు. బిజెపి కి భయపడి ఇలా అరెస్ట్ లు చేస్తున్నారని సోము అన్నారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తి లేదని అన్నారు. కేసీఆర్ కుట్రలను ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. సంజయ్ ని భేషరత్ గా విడుదల చేయాలనీ ఆయన డిమాండ్ చేసారు.

ఇక బండి సంజయ్ అరెస్టును వరంగల్ సీపీ రంగనాథ్ ధృవీకరించారు. మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్ హస్తం ఉన్నట్లు నిర్ధారించారు. వాటి ఆధారంగానే మొత్తం మూడు కేసులు నమోదు చేశారు.. 420, 120B, సెక్షన్ 5 ఆఫ్ మాల్ ప్రాక్టీస్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పకడ్బందీగా నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. మొత్తం వ్యవహారాన్ని 3గంటలకు మీడియా ముందు సీపీ రంగనాథ్ ఉంచనున్నారు.