నవీన్ పొలిశెట్టి తో త్రివిక్రమ్ మూవీ

జాతి రత్నాలు మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి.. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. అంటే ఈ సినిమా కు త్రివిక్రమ్ డైరెక్షన్ చేయడం లేదు..నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

త్రివిక్రమ్ తన సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్‌ని ప్రారంభించి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఫార్చ్యూన్ 4 సినిమాస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘జాతి రత్నాలు’ దర్శకత్వ బృందంలో పని చేసిన కళ్యాణ్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ కి స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తున్నారు. సాగర్ ఈ మూవీ కి డైరెక్షన్ చేస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు రానా నటిస్తున్నాడు.

YouTube video