ఏపీ బిజెపి అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయబోతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను బుధువారం విడుదల చేసింది.

అసెంబ్లీ బరిలో పోటీ చేసే అభ్యర్థులు వీరే..

 • ఎచ్చెర్ల – ఈశ్వరరావు
 • విశాఖ నార్త్ – విష్ణుకుమార్ రాజు
 • అరకు వ్యాలీ – రాజారావు
  *అనపర్తి – శివకృష్ణంరాజు
 • కైకలూరు – కామినేని శ్రీనివాస్
 • విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి
 • బద్వేల్ – బొజ్జ రోశన్న
 • జమ్మలమడుగు – ఆదినారాయణరెడ్డి
 • ఆదోని – పార్థసారథి
 • ధర్మవరం నుంచి వై.సత్యకుమార్ పోటీ చేయబోతున్నారు.

ఇక బిజెపి లోక్ సభ అభ్యర్థులను చూస్తే..

 • అరకు – కొత్తపల్లి గీత
 • అనకాపల్లి – సీఎం రమేష్
 • రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డి
 • నర్సాపురం – భూపతిరాజు శ్రీనివాసవర్మ
 • తిరుపతి – వరప్రసాదరావు
 • రాజమండ్రి – దగ్గుబాటి పురంధేశ్వరి లు బరిలోకి దిగుతున్నారు.