మాజీ మంత్రి ఆనంద్ బాబు హౌస్ అరెస్ట్

పోలీసులు తెదేపా నేతల మధ్య వాగ్వాదం : ఉద్రిక్తతTDP leader Anand babu house arrested

Guntur: మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద శనివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొండపల్లి వెళ్లేందుకు శనివారం గుంటూరు లోని తన ఇంటి నుంచి ఆనంద్ బాబు బయటకువచ్చారు . అయితే ఇంటి గేటు వద్దే ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక దశలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టిడిపి నేతలు నినాదాలు చేశారు. అనంతరం ఆనంద్ బాబు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ప్రస్తుతం ఆనంద్ బాబు హౌస్ అరెస్ట్ లో ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/