ఫిబ్రవరి 24 లేదా మార్చి నాలుగు నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

అమరావతి: ఫిబ్రవరి 24 లేదా మార్చి నాలుగో తేదీల నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. 8-10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల తేదీలను సీఎం ఖరారు చేసిన అనంతరం ఒకటీ, రెండు రోజుల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మరోవైపు పీఆర్సీ(PRC) కోసం ఉద్యోగస్థులు ఆందోళనలు చేస్తుండగా.. ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/