శ్రీవారిని దర్శించుకున్న రోజా

Roja
Roja

తిరుమల: వైఎస్‌ఆర్‌సిపి నేత రోజా ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. ఏపిలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్న చంద్రబాబును రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు తరిమికొట్టాలని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే నారా లోకేశ్‌ను మంగళగిరిలో ఓడించారని ఆమె చెప్పారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేయడం సిగ్గుమాలిన చర్యని ఆమె అన్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తున్నారని, ఏపీ సీఎం జగన్‌ మాత్రం ఏపీ అభివృద్ధికి కోసం పనిచేస్తున్నారని ఆమె అన్నారు. లోకేశ్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న సామాజిక మాధ్యమాల్లో చేస్తోన్న అసత్య ప్రచారంపై ఒకవేళ ఫిర్యాదు చేస్తే 80 శాతం మంది టిడిపి నేతలు జైల్లో ఉంటారని చెప్పారు. 14 రోజుల్లోపు సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయలేకపోయారని, దీంతో ఏపీ రాజధాని బిల్లు ఆమోదం పొందినట్లేనని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/