అనంతపురం జిల్లాకు 471 మంది విదేశీయులు రావడంతో..భయాందోళనలో జిల్లావాసులు

అనంతపురం జిల్లాకు 471 మంది విదేశీయులు రావడంతో..భయాందోళనలో జిల్లావాసులు

మళ్లీ ప్రజల్లో భయం మొదలైంది. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. కాస్త తగ్గిందనుకునేలోపే మళ్లీ దాని పంజా విసురుతుంది. ఇప్పుడు కరోనా రూపం మార్చుకొని ఓమిక్రాన్ గా ప్రజల ప్రాణాలు తీసుకునేందుకు బయటకు వచ్చింది. ఇప్పటికే పలు దేశాలతో పాటు మన దేశంలోనూ కేసులు నమోదు అవుతుండడం తో అంత ఖంగారుపడుతున్నారు. ముఖ్యంగా బయట దేశాల నుండి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ఈ తరుణంలో అనంతపురం జిల్లాకు 471 మంది విదేశీయుల రాగ..వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ తేలడం తో జిల్లా వాసులు భయపడుతున్నారు. దీంతో విదేశాల నుంచి అనంతపురం జిల్లాకు వచ్చిన వారిప్తె ఆరోగ్య శాఖ నిఘా పెట్టింది. నిన్న తొలి విడతలో 252 మంది విదేశీ ప్రయాణికులకు కి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు వైద్య శాఖ అధికారులు. అయితే వీరిలో ముగ్గురికీ కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు గుర్తించారు వైద్య శాఖ అధికారులు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించేందుకు హ్తెదరాబాద్ లోని సీసీఎంబీకి నమూనాలు పంపారు.