ఛార్లెట్ లో ‘నాటా’ కుటుంబ సంబరాలు

NATA Family Festival

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీన ఛార్లెట్‌లో ఏర్పాటు చేసిన నాటా కుటుంబ సంబరాలు కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. నాటా చార్లెట్‌ బృందం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం  పిల్లల భవిష్యత్తుకి తోడ్పడేట్టుగా, వారిని ఉద్దేశించి, వారికి ప్రోత్సాహం అందించే దిశగా జరిగింది. నాటా ప్రెసిడెంటు ఎలెక్టు, శ్రీధర్‌ కొర్సపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటా చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలను అందరికీ వివరించారు.
నాటా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌, రాధాకృష్ణ కలువాయి హాజరయ్యారు వర్షం, పలుచోట్ల మంచు పడుతున్నా, లెక్క చేయకుండా విజయవంతం చేసిన వారందరికీ నాటా ఛార్లెట్‌ బృందం హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపింది

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/