తూళ్లూరులో చంద్రబాబు, రామకృష్ణల పర్యటన

Ramakrishna and Chandrababu
Ramakrishna and Chandrababu

గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లు తూళ్లూరు-తాడికొండలో పర్యటిచంనున్నారని మాజీ ఎమ్మెల్యె తెనాలి శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు. వీరివురూ కలిసి ఈ పర్యటనలో పాల్గొననున్నారని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. గత 50 రోజులుగా రాజధాని రైతులు, రైతు కూలీలు చేస్తున్న దీక్షలకు మద్దతుగా ఈరోజు ఉదయం 10 గంటలకు రాయపూడి గ్రామంలో, 11 గంటలకు తుళ్లూరు గ్రామంలో, మధ్యాహ్నం 12 గంటలకు పెదపరిమి గ్రామంలో, మధ్యాహ్నం ఒంటి గంటకు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/