పేదలకు స్థలాలను ఇవ్వడం ఎవరూ తప్పుపట్టరు

వివాదాలు లేని భూములనే కేటాయించండి: పవన్‌

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: ఇళ్లు లేని పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం మంచిదే, కానీ ఎలాంటి వివాదాలకు తావులేని భూములను మాత్రమే ఇళ్ల స్థలాలకు కేటాయించాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పవన్‌ కళ్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. రాజధాని కోసం సేకరించిన భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడం సరైంది కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇళ్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పు పట్టరు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములనే వారికి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఓవైపు భూములిచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుందని ఆయన అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/