రష్యా దళాల ఆధీనంలో అణువిద్యుత్ ప్లాంట్‌

కొనసాగుతున్న భీకర పోరు

Russian forces attack Zaporizhia Nuclear Power Plant‌
Russian forces attack Zaporizhia Nuclear Power Plant‌

ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా తన దాడులను ముమ్మరం చేసింది. పోర్ట్ సిటీ ఖెర్సన్‌ నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు తాజాగా పోల్‌, ఖార్కివ్‌, ఎనర్హోదర్, ఓఖ్టిర్కా, చెర్నెహివ్‌ నగరాలను సైతం చుట్టుముట్టింది. ఇదిలా ఉండగా, తాజాగా, జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌ను రష్యన్ సైన్యం తన ఆధీనం లోకి తెచ్చుకుంది. అతిపెద్ద విద్యుత్ కేంద్రమైన జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తాజా పరిస్థితి పై ఉక్రేనియన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది .

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/