రాజధాని తరలింపుపై విచారణ 27కి వాయిదా

వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను వ్యతిరేకిస్తూ పిటిషన్లు

ap high court
ap high court

అమరావతి: అమరావతి నుండి కార్యాలయాల తరలింపు విషయంలో ఈనెల 27వ తేదీ వరకూ యథాతథ స్థితి(స్టేటస్‌ కో) పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది. కాగా, ఆన్ లైన్ విచారణలో పలు సమస్యలు ఉన్నాయని, తమ పిటిషన్లను ప్రత్యక్ష పద్ధతిలో విచారణ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే, ప్రభుత్వం తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది స్పందిస్తూ, కరోనా వ్యాప్తి కారణంగా నేరుగా హైకోర్టులో వాదనలు వినిపించలేమని, ప్రభుత్వం తరఫున డిల్లీ నుండి తన వాదనలు వినిపిస్తానని తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/