రష్యా నుంచి సమాచారం రాలేదు..డబ్ల్యూహెచ్ఓ

ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నాం

WHO

రష్యా: కరోనా వైరస్‌కు రష్యా వ్యాక్సిన్‌ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే రష్యా రిజిస్టర్ చేసిన కరోనా వ్యాక్సిన్ సమర్థతపై తమ వద్ద ఎటువంటి సమాచారమూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్వీపై రష్యా కూడా ఎటువంటి సమాచారం అందించలేదని, అది ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఆ దేశంతో చర్చిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ అయల్వార్డ్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్లలో 9 వ్యాక్సిన్లు ప్రయోగదశలో ముందున్నాయని, వాటిల్లో స్పుత్నిక్ లేదని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తయారీ డీల్స్, ఇన్వెస్ట్ మెంట్స్ కోసం తయారవుతున్న వ్యాక్సిన్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఈ 9 టీకాలూ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని గుర్తించామని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/