బాలు కుటుంబ సభ్యులను పరామర్శించిన సిఎం జగన్‌

ఎస్పీ బాలు కుమారుడితో ఫోన్ లో మాట్లాడిన సిఎం జగన్‌

CM Jagan shocked by Jayaprakash Reddy death
CM Jagan

అమరావతి: మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బాలు మృతి పట్ల సిఎం జగన్‌ ఇంతకుముందు ట్విట్టర్ లో తన సంతాపం తెలియజేశారు. తాజాగా ఆయన బాలు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ను సిఎం జగన్ పరామర్శించారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ సూచించారు. కళా, సాంస్కృతిక రంగానికి ఆయన మరణం తీరని లోటు అని సిఎం జగన్ పేర్కొన్నారు. తరగని ప్రతిభ ఆయన సొంతం అని కొనియాడారు. తన గాన మాధుర్యంతో కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించారని తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/