హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

సీబీఐ దర్యాప్తుతో ప్రభుత్వ కుట్ర బయటపడడం ఖాయమన్న చంద్రబాబు

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ఘటనపై స్పందించారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ట్వీట్ చేశారు. ఎన్95 మాస్కు అడిగినందుకు ఓ డాక్టర్ పై తప్పుడు ప్రచారం చేస్తూ, నిర్బంధించడమే కాకుండా, పోలీసులతో హింసకు పాల్పడ్డారని, దీని వెనకున్న ప్రభుత్వ కుట్ర సీబీఐ దర్యాప్తుతో వెల్లడవుతుందని తాము గట్టిగా నమ్ముతున్నట్టు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/