డీజీపీకి చంద్రబాబు లేఖ

సోషల్ మీడియాలో వైఎస్‌ఆర్‌సిపి వాళ్లు మాత్రమే పోస్టులు పెట్టాలా?

chandrababu-press-meet

అమరావతి: చిత్తూరు రాకేశ్ ను అరెస్ట్ చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల తీరును తప్పబట్టారు. ఈ సదర్బంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… తనను, టీడీపీ నేత పులివర్తి నానిని విమర్శిస్తూ వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని… వాటిని ఖండిస్తూ రాకేశ్ చౌదరి అనే టీడీపీ అభిమాని పోస్టులు పెట్టారని చెప్పారు. దీంతో, రాకేశ్ ను స్టేషన్ కు పిలిపించి పోలీసులు బెదిరించారని… ఇది చాలా దారుణమని అన్నారు. సోషల్ మీడియాలో వైఎస్‌ఆర్‌సిపి వాళ్లు మాత్రమే పోస్టులు పెట్టాలా? టీడీపీ వాళ్లు పెడితే పోలీసులు బెదిరిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పోస్టులు తొలగించనని చెప్పినందుకు రాకేశ్ పై కుట్ర చేశారని… వేరే కేసులో అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాకేశ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి లేఖ రాశానని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/