ఏపి మంత్రి కుమారుడికి కరోనా నిర్ధారణ

హోమ్ క్వారంటైన్ లోకి కృష్ణదాస్, తమ్మినేని సీతారాం

ap minister dharmana-krishnadas

అమరావతి: ఏపి మంత్రి ధర్మాన కృష్ణదాసు కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కృష్ణదాస్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. మంత్రి తరపున కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. దీంతో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. కుమారుడికి పాజిటివ్ రావడంతో నిన్నటినుంచి మంత్రి కృష్ణదాసు హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. కాగా బుధవారం నాడు జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో కృష్ణదాస్ తో పాటు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇప్పటికే సీతారాం కూడా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. మరో రెండు వారాల పాటు మంత్రి, స్పీకర్ క్యాంపు కార్యాలయాలకు కార్యకర్తలు, ప్రజలు ఎవరూ రావద్దని అక్కడి అధికారులు కోరారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/