చంద్రబాబు అవినీతి చేశారనే విషయం స్పష్టమైంది

చంద్రబాబు, నారా లోకేష్‌ ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరగాలి

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్‌ ఇళ్లపై కూడా ఐటీ దాడులు చేయాలని మంత్రి బొత్స సత్యనారయణ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నాయుడు మాజీ పీఏ శ్రీనివాస్‌ నివాసంపై ఐటీ దాడులతో చంద్రబాబు అవినీతి చేశారనే విషయం స్పష్టం అవుతుందని బొత్స ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఐటీ దాడులు జరిగాయని ఐటీ శాఖ ప్రకటించిందని బొత్స అన్నారు. కాంట్రాక్టుల పేరుతో రాష్ట్రంలో రూ. వేల కోట్ల అవినీతికి టిడిపి పాల్పడిందని విమర్శించారు. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి అని అవినీతి కాదని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో టిడిపి నేతలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని ఆయన మండిపడ్డారు. తన మాజీ పీఎస్‌ అక్రమ లావాదేవీలపై చంద్రబాబు ఎందుకు నోరు మొదపడం లేదని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు అనుకూల మీడియా సైతం ఈ వార్తలను కవర్‌ చేయడం లేదని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/