ప్రభుత్వ భవనాలకు మళ్లీ రంగులు వేయండి

సిఎస్‌ను ఆదేశించిన ఏపి హైకోర్టు

Andhra Pradesh High Court
Andhra Pradesh High Court

అమరావతి: గ్రామ పంచాయతీ భవనాలకు పార్టీ రంగలు వేయడంపై ఏపి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రభుత్వ కార్యాలయాలకు, భవనాలకు రంగులు తొలగించి, మళ్లీ రంగలు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సిఎస్‌ నిర్ణయం ప్రకారం పది రోజుల్లోనే మళ్లీ రంగులు వేసి, కోర్టు ఆదేశాలను అమలు చేసినట్లు ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సిఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పై మేరకు ఆదేశాలు జారీ చేసింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/