ప్రధాని నివాసానికి జ్యోతిరాదిత్య సింధియా

Jyotiraditya Scindia Reaches PM Modi's Residence
Jyotiraditya Scindia Reaches PM Modi’s Residence

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్మెలతో కలిసి సోమవారం బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈరోజు సింధియా ప్రధాని మోడితో సమావేశమయ్యారు.కొద్ది సేపటి క్రితమే ఆయన ప్రధాని మోడి నివాసానికి వెళ్లారు.కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సైతం ఇదే సమయానికి మోడి నివాసానికి చేరుకోవడం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఈనేపథ్యలో సింధియా బిజెపిలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా దీనికి ముందు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశంతో సింధియాతో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ చర్చలు జరిపారని, ఆయనను రాజ్యసభకు పంపుతామని బుజ్జగించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. అయితే, సింధియా వెనక్కి తగ్గలేదని, చర్చలు విఫలమయ్యాయని చెబుతున్నారు. కాంగ్రెస్‌కు తలుపులు మూసేశారని అంటున్నారు. అనంతరం ఆయన మోదీ నివాసానికి బయలుదేరడం సంచలనమవుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/