ఆ ఫ్యాషన్ డిజైనర్ ను నేను పెళ్లి చేసుకోవడం లేదు – యాంకర్ ప్రదీప్ క్లారిటీ

బుల్లితెర మెయిల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో షోస్ లలో యాంకర్ గా వ్యవహరించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రదీప్ అంటే ఎంతో ఇష్టపడతారు. 37 ఏళ్ల ప్రదీప్ మాచిరాజు..ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచ్లర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే గత కొద్దీ రోజులుగా ఈయన ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతు తో ప్రేమలో ఉన్నాడని , ఇద్దరు డేటింగ్ ఉన్నారని , త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతూ వస్తుంది. ఈ ప్రచారం చూసి అంత నిజమే కావొచ్చని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ప్రదీప్ క్లారిటీ ఇచ్చారు.

అసలు నవ్య మారోతుతో నేను మాట్లాడిందే లేదు. ప్రొఫెషన్ లో భాగంగా మా టీమ్ ఇంటరాక్ట్ అయ్యారు. అంతకు మించి ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు. షూటింగ్ లో బిజీగా ఉండటం వలన స్పందించడం లేటయ్యిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంత కూడా కెరియర్ పైనే ఉందని , ఒకవేళ పెళ్లి చేసుకుంటే ముందే చెపుతానని తెలిపాడు.