మక్కా ఉమ్రా యాత్రను ప్రారంభించిన సౌదీ

Mecca
Mecca

రియాద్‌: మక్కా ఉమ్రా యాత్రను సౌదీ అరేబియా అధికారులు ఆదివారం ప్రారంభించారు. సౌదీ అరేబియా దేశంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధారణ అనంతరం.. రియాద్‌ మార్చిలో తీర్థయాత్రను నిలిపివేసింది. యాత్రను పలు దశల్లో తిరిగి ప్రారంభిస్తున్నారు. మొదటిదశలో ఆదివారం నుంచి 30 శాతం ప్రారంభమవుతుంది. రెండో దశ ఈ నెల 18న 75శాతం మంది యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నారు. నవంబర్‌ 1 నుంచి ఉమ్రా విదేశీ యాత్రికులందరినీ క్రమంగా అనుమతి ఇవ్వనున్నారు. యాత్రను వందశాతం నిర్వహించడం ఖకరోనా మహమ్మారిగపైనే ఆధారపడి ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. రియాద్‌లోని 1.08లక్షల మంది విదేశీలు, స్థానిక యాత్రికులు యాత్రలో పాల్గొనేందుకు అనుమతి పొందారు. కరోనా మార్గదర్శకాలను పాటించడంతో పాటు, రక్షణ చర్యలు తీసుకోనున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/