పౌరులు బహిరంగంగా తుపాకులు కలిగి ఉండడం వారి హక్కు : అమెరికా సుప్రీంకోర్టు

తుపాకి సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా చట్టం తీసుకొచ్చే పనిలో బైడెన్ సర్కారు.. అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

Gun firing in guntur district
Americans Have Right To Carry Guns In Public: US Supreme court

న్యూయార్క్ : ఇటీవల అమెరికాలో తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. పలు రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా తుపాకి సంస్కృతిపై చర్చ మొదలైంది. తుపాకులను నిషేధించాలన్న డిమాండ్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరోమారు చర్చనీయాంశమైంది. బహిరంగంగా తుపాకులు కలిగి ఉండడం అమెరికన్ల హక్కని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

6-3 మెజారిటీతో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్, బోస్టన్ తదితర పెద్ద నగరాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ పౌరులు తమ వెంట తుపాకులు తీసుకెళ్లొచ్చని, వ్యక్తిగత రక్షణకు బహిరంగంగా తుపాకి కలిగి ఉండడం ఓ వ్యక్తి హక్కు అని జస్టిస్ క్లారెన్స్ థామస్ తన తీర్పులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా న్యూయార్క్ గతంలో చేసిన చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. తుపాకి సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్న బైడెన్ సర్కారు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న ఆసక్తి మొదలైంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/