అగ్ర‌రాజ్యంలో ఏడు ల‌క్ష‌లు దాటిన కరోనా మృతుల సంఖ్య‌

వాషింగ్టన్: అమెరికాలో కోవిడ్ వ‌ల్ల మృతి చెందిన వారి సంఖ్య ఏడు ల‌క్ష‌లు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ డేటా ప్ర‌కారం గ‌డిచిన 108 రోజుల్లోనే ఆ దేశంలో కొత్త‌గా ల‌క్ష మందిపైగా మ‌ర‌ణించారు. ఇటీవ‌ల అమెరికాలో మ‌ళ్లీ వైర‌స్ ఇన్ఫెక్ష‌న్‌ కేసులు విప‌రీతంగా పెరిగాయి. డెల్టా వేరియంట్ ప్ర‌బ‌ల‌డం వ‌ల్ల మ‌ర‌ణాల సంఖ్య వేగం పెరిగింది. వ్యాక్సిన్ వేయించుకోని వారి సంఖ్య కూడా ఇంకా అధికంగానే ఉన్న‌ది.

తాజా మ‌ర‌ణాల సంఖ్య‌ను ప‌రిశీలిస్తే, అమెరికాలో ఇంకా హెచ్చు స్థాయిలోనే కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అత్య‌ధిక మృతుల సంఖ్య న‌మోదు అయిన దేశాల్లో.. బ్రెజిల్ రెండ‌వ స్థానంలో ఉంది. బ్రెజిల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 5,97000 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇక మూడ‌వ స్థానంలో ఇండియా ఉన్న‌ది. భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 4,48,00 మంది వైర‌స్ బారిన‌ప‌డి మృతిచెందారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/