సొంత రాష్ట్రాల్లో వెనకబడ్డారు!

biden – trump

వాషింగ్టన్‌: అమెరికాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. జో బైడెన్‌కు 238 ఎలక్టోరల్ ఓట్లను పొందగా.. డొనాల్డ్ ట్రంప్ 213 ఓట్లతో కొంత వెనకబడ్డారు. ఇదిలా ఉంటే.. ఇరు పార్టీల అభ్యర్థుల సొంత రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికా అధ్యక్షుడి సొంత రాష్ట్రమైన న్యూయార్క్‌లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. 29 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో జో బైడెన్‌కు 37.89లక్షల ఓట్లు పోలవగా, డొనాల్డ్ ట్రంప్ కేవలం 29.56లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. జో బైడెన్ సొంత రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం కనబరుస్తున్నారు. 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్‌కు 29.65లక్షల ఓట్లు పడగా.. బైడెన్‌కు 22.90లక్షల ఓట్లు లభించాయి. పెన్సిల్వేనియాలో పోలైన ఓట్లలో ఇప్పటి వరకు 64 శాతం ఓట్లను లెక్కించారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/