ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులు
రష్యా దాడులతో ఎమర్జెన్సీ

రష్యా దాడులతో ఉక్రెయిన్ ఎమర్జెన్సీ విధించింది . రష్యా దాడుల నుంచి తమ దేశాన్ని, ప్రజలను రక్షించు కుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. కాగా, ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్ మూసేయడంతో విమానాల రాకపోకలు నిలిచి పోయాయి. దీంతో ఉక్రెయిన్‌లో వేలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో భారతీయుల భద్రతపై ఆయా కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/