సంధ్య థియేటర్ లో సందడి చేసిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ పార్ట్ 1 ఈరోజు (డిసెంబర్ 17) వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక హీరోయిన్ గా సునీల్ , అనసూయ ఇతర పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో తెల్లవారు జామునుండే షోస్ పడడంతో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి ఉదయం నుండే మొదలైంది. ఇక టాక్ కూడా పాజిటివ్ రావడం తో అభిమానులతో పాటు చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వున్న సంధ్య థియేటర్ లో సినిమా చూడటానికి అల్లు అర్జున్ వచ్చారు. ఈ విషయం ముందు బయటికి పొక్కడంతో బన్నీని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కార్ ఓపెన్ విండో ద్వారా బయటికి వచ్చిన బన్నీ ప్రేక్షకులు తనని చూస్తూ చేస్తున్న హంగామాని గమనించి వారికి అభివాదం చేశారు.

దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన అభిమానులు కేకలు.. అరుపులతో రచ్చ రచ్చ చేశారు. హీరో అల్లు అర్జున్ ని చుట్టుముట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సినిమా కు పాజిటీవ్ టాక్ వినిపిస్తుండటం.. ప్రతీ థీయేటర్ వద్ద అభిమానులు హంగామా చేస్తుండటంతో బన్నీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.