అసోంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు..190 మంది మృతి

Assam flood: Death toll climbs to 190 as 3 more die, 620 villages remain inundated

అసోం ః గత కొన్ని రోజులుగా అసోంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద కారణంగా వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వర్షాలు, వరదలకు ఇప్పటివరకు 190 మంది మృతి చెందారు. రుతుపవనాలు చురుగ్గా కదలడంతో అసోంలోని 11 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 9 లక్షమంది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి. శుక్రవారం కురిసిన వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. 620 గ్రామాలు నీటిలో మగ్గుతున్నాయి. వర్షాలు, వరదలకు 14వేల 402 హెకార్టర్లలో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.10 జిల్లాలో 173 సహాయక శిబిరాల్లో 75 వేలకుపైగా ప్రజలు తలదాచుకుంటున్న‌ట్లు స‌మాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/