భారత్ లో సెంచరీ దాటినా ఒమిక్రాన్ కేసులు..

ఇండియాలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఒకటి రెండే అనుకున్నామో లేదో ఈరోజు ఏకంగా సెంచరీ దాటాయి. రెండేళ్లు గా కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వాక్సిన్ అందుబాటులోకి రావడం..ప్రజలంతా వాక్సిన్ వేసుకోవడం తో కరోనా పీడ విరిగినట్లే అని అనుకున్నారో లేదో..కొత్త రూపం మార్చుకున్న ఒమిక్రాన్ వేరియంట్‌తో విరుచుకుపడుతోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తోంది. మన దేశంలోకి ఎంట్రీ ఆలస్యంగా ఇచ్చినప్పటికీ.. ప్రస్తుతం రోజు రోజుకు కేసులు విజృంభిస్తున్నాయి. ఈ రాష్ట్రం.. ఆ రాష్ట్రం అని లేదు.. దేశమంతా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఇప్పటికే ఈ ఒమిక్రాన్ వేరియంట్.. 70కి పైగా దేశాలకు విస్తరించింది. అయితే.. ఈ వేరియంట్ మన ఇండియాను కూడా కలిచి వేస్తుంది. భారత దేశంలో ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి లవ్ అగర్వాల్ కాసేపటి క్రితమే ప్రకటన చేశారు. ఇప్పటి వరకు దేశంలో 101 కి ఒమిక్రాన్ కేసులు చేరినట్లు ఆయన వివరించారు. మహారాష్ట్ర లో 32 కేసులు, ఢిల్లీలో 22 కేసులు, రాజస్థాన్‌లో 17 కేసులు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల లో 8 కేసులు నమోదు అయినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. ఇక అటు ఏపీలోనూ రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు వివరించారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యం లో.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.