అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మూవీ టాక్

గత కొంతకాలంగా సరైన హిట్స్ లేని అల్లరి నరేష్ కు నాంది చిత్రం సూపర్ హిట్ అయ్యి..నరేష్ సినీ కెరియర్ కు ఊపిరి పోసిన సంగతి తెలిసిందే. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల డైరెక్షన్లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించి..నరేష్ లోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఇక ఇప్పుడు ఇదే డైరెక్టర్ డైరెక్షన్లో ఉగ్రం అనే మూవీ చేసాడు నరేష్. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మించారు.

ఈ మూవీ తో ‘మిర్నా’ అనే హీరోయిన్ తెలుగు తెరకి పరిచమైంది. మంచి అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ టాక్ వస్తుంది. దర్శకుడు విజయ్ రాసుకున్న కథ బాగున్నా.. కథనాన్ని ఆయన నడిపించిన తీరు బాగాలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్ సినిమా ఏమీలేదని అంటున్నారు. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుందని.. లవ్ ట్రాక్ వర్కౌట్ కాలేదని చెబుతున్నారు. సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తరవాత నుంచి ట్రాక్ ఎక్కుతుందని.. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుందని అంటున్నారు. అయితే, ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బాగుందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. మిస్టరీని సాల్వ్ చేయడం, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ సెకండాఫ్‌లో ప్రేక్షకుడికి ఊరట కలిగిస్తాయట. అయితే, ఇన్వెస్టిగేషన్‌లో కూడా కథనం కాస్త నెమ్మదిగా ఉండటం మైనస్ అని అంటున్నారు.

సినిమా ఎలా ఉన్నా అల్లరి నరేష్ నటన మాత్రం అద్భుతమని అంతా కొనియాడుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో నరేష్ ఉగ్రరూపం కనిపించిందని అంటున్నారు. అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్ కోసమైనా సినిమా చూడాలని చెబుతున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత మేర నిలబడుతుందో చూడాలి.