తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్విట్టిర్‌ ఖాతా హ్యాక్‌..మారిన ప్రొఫైల్ నేమ్‌, ఫొటో

all-india-trinamool-congress-twitter-account-appears-to-be-hacked

కోల్‌కతాః పశ్చిమబెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయింది. పార్టీ అకౌంట్‌ పేరుతోపాటు, లోగోను మార్చేశారు. టీఎంసీ ప్లేస్‌లో యుగా ల్యాబ్స్‌ పేరు ప్రత్యక్షమయింది. అదేవిధంగా పార్టీ ఎన్నికల గుర్తయిన రెండు ఆకుల చిహ్నం స్థానంలో వై ఎల్‌ ఆకారంలో ఉన్న ఓ సింబల్‌ను ఉంచారు. అయితే ఖాతా పేరు కింద మాత్రం ఏఐటీసీ (ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్-AITC‌) పేరును అలాగే ఉంచారు. కాగా, ట్విట్టర్‌ అకౌంట్‌ 12 గంటల క్రితం హ్యాక్‌ అయినప్పటికీ.. హ్యాకర్‌లు ఇప్పటివరకు ఎలాంటి పోస్టులు పెట్టలేదు. ఈ మేరకు పార్గాలు వెల్లడించాయి. యూగా ల్యాబ్స్‌ అనేది అమెరికాకు చెందిన ఓ ప్రముఖ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ సంస్థ. ఇది ఎన్‌ఎఫ్‌టీలు, డిజిటల్‌ కలెక్టిబుల్స్‌ను అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా క్రిప్టోకరెన్సీ, డిజిటల్ మీడియాలో కూడా సంస్థ ప్రత్యేక స్థానం కలిగి ఉంది.

కాగా, గతేడాది డిసెంబర్‌ 10న ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ అయిన వైఎస్‌ఆర్‌సిసి అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ను దుండగులు హ్యాక్‌ చేశారు. అకౌంట్‌లో కొత్త ట్వీట్లు పోస్ట్‌ చేశారు. దీంతో వాటినిచూసిన పార్టీ కార్యకర్తలు చూసి అవాక్కయ్యారు. హ్యాకర్లు ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్, కవర్ పిక్ లను మార్చేశారు. పేరుతో వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ ఖాతాను మార్చేశారు. ఖాతా పేరు కింద మాత్రం పేరును అలాగే ఉంచారు.