పీఎస్‌1 ఫస్ట్ వీక్ కలెక్షన్స్

మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్ పొన్నియిన్‌ సెల్వన్‌ (పీఎస్‌1 ) బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం పీయస్‌-1 (పొన్నియన్ సెల్వన్) గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా తమిళ్‌, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదలైంది. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. విడుదలైన మొదటి ఆట తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది.

ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ‘పీఎస్‌1’ తొలి వారంలో అద్భుత‌మైన బిజినెస్ చేసింది. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా తమిళ్‌, హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుద‌లైన ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే రూ. 325 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ విష‌యాన్ని ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ ధృవీకరించారు. ఈ వారాంతంలో రూ. 350 కోట్ల మార్క్ దాటుతుంద‌ని అంచ‌నా వేశారు.